కర్నూలు లో వినాయక శోభాయాత్ర ఘనంగా ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 9 గంటలకు కర్నూలు నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద తొలి గణణాధుడి విగ్రహా పూజకు జిల్లా కలెక్టర్ రంజీత్ బాష, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం, ఆదోని, పత్తికొండ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, పార్థసారథి, కేఈ. శ్యామ్ బాబు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. కర్నూలు లో వినాయక నిమజ్జనం రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈవేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు లక్షల ఒక్కవెయ్యి రూపాయలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.