మైదుకూరు పట్టణం నుంచి గణపతి విగ్రహాలను యువకులు ఆనందోత్సవాల మధ్య మండపాలకు మంగళవారం తరలిస్తున్నారు. యువకులు వాయిద్యాలు వాయిస్తూ విగ్రహాల తరలింపులో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడినది. విగ్రహాల తరలింపునకు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు అధిక సంఖ్యలో రావడంతో పోలీస్ సిబ్బంది వాటిని క్రమబద్ధీకరించినందుకు అవస్థలు పడ్డారు.