ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం వ్యత్యాసం చూపిందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ మండిపడ్డారు. సోమవారం శ్రీకాకుళంలోని జెడ్పి గ్రీవెన్స్లో యూరియా, ఎరువుల కొరతపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రజలను రెచ్చగొట్టదని హితవు పలికారు.