ఎల్బీనగర్ డివిజన్లోని పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందితో కలిసి ఏసీబీ కృష్ణయ్య మంగళవారం మధ్యాహ్నం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.