విశాఖలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యయి. ఇందిరాగాంధీ స్టేడియంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ విశాఖ చేరుకున్నారు. సభా ప్రాంగణం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కాగా 30న జరిగే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా పేరు పెట్టారు. ఇక ముఖద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుండమ్మ, మహాకవి శ్రీశ్రీల పేర్లను ఖరారు చేశారు. అల్లూరి ప్రాంగణానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలు హాజరవుతారు.