కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్ ను వెంటనే పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్కు కళ్యాణదుర్గం నియోజకవర్గం వికలాంగుల సంఘం అధ్యక్షులు పాతలింగ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాత లింగ కలెక్టర్కు విన్నవించారు. అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్లు ఎందుకు పెన్షన్లు తొలగించారని ప్రశ్నించారు. పెన్షన్లు పునరుద్ధరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.