జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..... అన్నమయ్య జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు అవసరానికంటే మించిన యూరియా అందుబాటులో ఉందని, జిల్లాలో యూరియా కొరత రావడానికి అవకాశమే లేదన్నారు. ఈరోజు పంట పండించే ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున ఇవ్వగలిగే యూరియా నిల్వలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయన్నారు. అన్నమయ్య జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 44% లోటు వర్షపాతం నమోదయిందని దీనివల్ల 57 వేల హెక్టార్లకు గాను కేవలం 10600 హెక్టార్లలో సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అంటే 18 శాతం మాత్రమే సాగవుతోందన్నారు. సెప్టెంబర్ 6 నాటికి ప్రైవేటు డీలర్ల వద్ద 518 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలలో 460 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాట