ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజు అన్నారు. శనివారం వాంకిడి మండలం బెండార డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు..దేశంలో అణిచివేతకు గురవుతున్న వర్గాలలోని మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకొని అణిచివేతను అధిగమించేందుకు ముందుకు రావాలని తెలిపారు. రాజ్యాంగం చట్టాల ద్వారా కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించిందని, వరకట్న వేధింపుల నిషేధ చట్టం, బాల్యవివాహాల నిషేధం,ఫోక్సో,మహిళల అక్రమ రవాణా, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కుల తో పాటు నూతనంగా అమలులోకి వచ్చిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు