కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన ఉమా మహేష్ డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటాడు. వ్యాయామ ఉపాధ్యాయ (పీ ఈ టీ) గా ఎంపికయ్యాడు రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు, జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉమామహేష్ ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సన్మానించారు.ఎమ్మెల్యే చొరవతో ఉచితంగా ఇచ్చిన శిక్షణ కారణంగానే ఉద్యోగం వచ్చిందని ఉమామహేష్ చెప్పారు. ఎమ్మెల్యేకు రుణపడి ఉంటానన్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.