పాతపట్నం మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో శక్తి యాప్పై బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఆదేశాల మేరకు యాప్ గురించి విద్యార్థులకు వివరిస్తున్నామని టీం సభ్యులు తెలిపారు. ఆపదలో ఆసరా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ దీన్ని మొబైలలో డౌన్లోడ్ చేసుకోవాలని టీం ఇన్ఛార్జి గిరిధర్ అన్నారు. పోక్సో చట్టం, ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ రూల్స్ను స్టూడెంట్స్కు ఆయన వివరించారు. వసతి గృహ సంక్షేమ అధికారి ఉన్నారు.