ఆళ్లగడ్డ: మంటపాలకు తరలుతున్న గణనాథులు ఈనెల 27న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో ఎక్కడ చూసినా బొజ్జ గణపయ్య ల సందడి నెలకొంది. ఆళ్లగడ్డ పట్టణంలో రెండు రోజుల ముందే గణనాథులను మంటపాలకు తరలిస్తున్నారు.దీంతో ఆళ్లగడ్డ పట్టణంలో వినాయక కొనుగోలు కేంద్రం వద్ద సందడి నెలకొంది. మరోవైపు పలువురు పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.