ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురం గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. తూర్పు బొమ్మలాపురం ఎస్సీ పాలెం నివాసి వేష పోగు యోహాన్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న దోర్నాల ఎస్ఐ మహేష్ సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.