జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా యథేచ్ఛగా పుస్తకాలు అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఎ కర్నూలు నగర శాఖ కార్య దర్శి సాయి ఉదయ్ అన్నారు. మంగళవారం కర్నూలులోని పలు ప్రైవేట్ విద్యా సంస్థల ముందు ఎస్ఎఫ్ఎ నాయకులు ధర్నా చేపట్టారు. సాయి ఉదయ్ మాట్లాడుతూ.. సంబంధిత ఎంఈవోకు సమాచారం అందించినా తనిఖీకి రాకపోవడం బాధాకరమన్నారు.