ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట వేసి, ఆరోగ్య పరిరక్షణ వసతుల కల్పన కొరకు విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం రామచంద్రాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో సుమారు 40 లక్షల అంచనా వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందన్నారు.