అల్లూరి జిల్లా పాడేరు తలారి సింగి వద్ద శనివారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలు పారయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు 108 సహాయంతో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం తలారి సింగి వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి అందులో ఒకరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించామని తెలియజేశారు. అయితే మద్యం మత్తు అధిక వేగం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.