పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామ సమీపంలోని సోలార్ పరిశ్రమ ప్రాంతంలో రాత్రి వేలల్లో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. చిరుత పరిశ్రమ పరిసరాలలో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో స్థానికులు, సోలార్ పరిశ్రమ కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. కంపెనీ అధికారులు చిరుత సంచారం విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు బుధవారం రోజున తెలిసింది.