నల్లగొండ జిల్లాలో బాలికపై లైంగిక దాడి కేసులో నల్లగొండ మంగళవారం సంచలమైన తీర్పును వెల్లడించింది. ఇరువైపు వాదనలు పరిశీలించిన న్యాయస్థానం ఇన్చార్జి జడ్జి రోజా రమణి నిందితుడికి 51యేండ్లు జైలు శిక్షను విధించారు.ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలను వినిపించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిప్పర్తి మోడల్ స్కూల్ 10వ తరగతి చదువుతున్న మైనర్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడి 3 నవంబర్ 2021న బడి ముగించుకుని బస్ స్టాప్ వద్ద ఉన్న మైనర్ అమ్మాయిని షేక్ మొహమ్మద్ ఖాయం బలవంతంగా బండి ఎక్కించుకొని ఒక పాడుబడ్డ ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారం చేశారు.