కర్నూలు జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో శుక్రవారం ఓర్వకల్లు జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలు, మత్తుపదార్థాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ హాజరై, మాట్లాడుతూ సైబర్ మోసాల నుండి జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయరాదని హెచ్చరించారు. హెల్ప్‌లైన్లు 1930, 112 ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.