పుట్లూరు మండలం శనగలగూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంగన్నపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి మృతి చెందాడు. బైక్పై స్టీల్ ప్లాంట్కు వెళ్తుండగా ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.