స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ ఆదాయం భారీగా తగ్గిపోయిందని ఆరోపిస్తూ, ఆటో కార్మికులు గురువారం భీమిలిలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తగరపువలస జంక్షన్ నుండి ఆటోలతో ర్యాలీగా వచ్చి నిరసన తెలియజేశారు. అనంతరం, భీమిలి ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించి ఆర్డీఓ సంగీత్ మాధుర్‌కు వినతిపత్రం సమర్పించారు.