ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ నేడు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన సమస్యలపై 50 ఫిర్యాదులు అందాయని, వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించి, మిగతా వాటిని వివిధ సంబంధిత శాఖలకు సిఫార్సు చేశామని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు దరఖాస్తులు పేర్కొన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.