హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి రోజా ఆర్కే రోజా శనివారం తీవ్రంగా స్పందించారు. అనితకు దమ్ముంటే రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కళాశాలలకు రావాలని, అక్కడ కళాశాలల పరిస్థితి, విద్యార్థుల వివరాలు చూపిస్తానని రోజా సవాల్ విసిరారు. పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ మాట్లాడుతున్నారని, ఆమె యాంకరా లేక హోం మినిస్టరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అనితకు లేదని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.