అన్నమయ్య జిల్లా,సంబేపల్లి మండల పోలీస్ స్టేషన్ ఎదురుగా కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది.వేగంగా వస్తున్న ఆటోను డ్రైవర్ కంట్రోల్ చేయలేక పోవడంతో ఆటో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదం లో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి.గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..