ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కమిషనర్ ఆర్థికంగా నష్టం కల్గించే విదంగా వ్యవహరిస్తున్నాడని మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారెడ్డి, ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ టెండర్ ద్వారా మున్సిపాలిటీకి రూ.2 కోట్లు రాబడి వస్తుందన్నారు. ఇందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు కమిషనర్ సహకరించడం లేదన్నారు. ఎమ్మెల్యే, కొండారెడ్డి కి అనుకూలంగా కమీషనర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే రెండు కోట్ల ఆదాయాన్ని టిడిపి వారికి కట్టబెట్టేందుకే కమీషనర్ సహకరిస్తున్నారన్నారు