హుజురాబాద్: పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శుక్రవారం సాయంత్రం యూరియా బస్తాలు వస్తున్నాయి అన్న సమాచారంతో రైతులు బారులు తీరారు కిలోమీటర్ల దూరంలో క్యూ లైన్ నిలబడ్డారు. పోలీసుల సమక్షంలో సొసైటీ తాళం వేసి ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతించి రెండు కౌంటర్లు ఓపెన్ చేసి ఆధార్ కార్డుల ఆధారంగా టోకెన్ లు పంపిణీ చేశారు. అధికారులు 450 యూరియా బస్తాలు వస్తాయని చెప్పగా 200 బస్తాలు తక్కువగా వచ్చాయని క్యూ లైన్ లో నిలబడే రైతులకు యూరియా సరిపోదని రైతులకు సరిపడే యూరియా సరఫరా చేయాలని రైతులకు కోరుతున్నారు.