ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు, ఎండోమెంట్ అధికారులు నేడు ఆదివారం రోజున ఉదయం మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులు, పర్యాటకులకు అనుమతి కల్పిస్తామని ఈవో శ్రీనివాస్, అర్చకులు వివరించారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.