ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా... శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ పట్టణానికి చెందిన విద్యార్థి కొత్తపల్లి రామ్ చరణ్ (14) అయినా చిత్రపటాన్ని తెల్ల కాగితంపై కటింగ్ తో తయారు చేశారు. 9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి.. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, అవకాశం లభిస్తే ఈ చిత్రపటాన్ని పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా అందజేస్తానని తెలిపారు.