రైతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామనాధ్ కేకన్ ఐపిఎస్ రైతన్నలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా యస్పి అన్నారు జిల్లాలోని బయ్యారం రైతు వేదికలో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు, అధికారులతో మాట్లాడి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.క్యూలైన్లలో ఎలాంటి తోపులాటలు జరగకుండా ఎక్కువసేపు లైన్లో నిల్చోకుండా క్లస్టర్ల వారీగా క్యూలైన్లను ఏర్పాటు చేయించి త్వరితగతిన యూరియా అందేలా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు బయ్యారం సీఐ మరియు ఏఆర్డిఎస్పి శ్రీనివాస్ పాల్గొన్నారు.