రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి మెలగాలని విజయవాడ సత్యనారాయణ పురం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు ఆయన స్వయంగా సూచనలు జారీ చేశారు. ప్రతి ఆదివారం రౌడీషీటర్ లో తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు హాజరు కావాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అదేవిధంగా నగర బహిష్కరణ కూడా తప్పదన్నారు. ఎవరైనా మద్యం గంజాయి వంటివి రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు తెలిపారు.