ఆసిఫాబాద్ జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కొమురం భీం అడ ప్రాజెక్ట్ 7,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం మూడు గేట్లను 1.0మీటర్ల మేర ఎత్తి 6,512 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదిలారు. దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.