“మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే శుభసందేశాన్ని ముందుకు తెచ్చి, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నది కర్నూలు జిల్లా పాత్రికేయ సమాజం.వినాయక చవితి సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో పాత్రికేయ గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 12 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఈ మహోత్సవాన్ని జిల్లా అంతటా జరుపుకునే విధంగా ఘనంగా ప్రారంభించారు.రెండేళ్లుగా కర్నూలులోని పాత్రికేయులు ఐక్యమత్యంగా మట్టి వినాయకుని నెలకొల్పుతూ సమాజానికి ఒక కొత్త దిశ చూపుతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్టించడం ద్వారా