అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని నర్సరీలు అధికంగా ఉన్నాయని, వాటిపై అధికారులు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ అన్నారు.శుక్రవారం మైదుకూరులో రైతు సంఘం నాయకులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, నాసిరకం విత్తనాలతో నారును పెంచి రైతులకు అమ్ముతున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ అధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రమణ డిమాండ్ చేశారు.