జిల్లా పోలీసు కార్యాలయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 81 పిటీషన్లు మహిళా డిఎస్పి మహబూబ్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ గారి ఆదేశాల మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్వహించిన " PGRS" కార్యక్రమంలో 81 పిటీషన్లు స్వీకరించారు.జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రతీ పిటీషనర్ తో మహిళా డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా మాట్లాడారు.సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి పిటీషన్లకు పరిష్కారం చూపాలని సూచించారు. PGRS కార్యక్రమంలో భార్యాభర్తల గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు, తదితర అంశాలపై పిటీషన్లు అందజేశారు.