ఆదోని పట్టణంలోని 12వ వార్డు సచివాలయంలో సచివాలయం ఉద్యోగి వార్డులో అందుబాటు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేయడం జరిగింది. మహిళా సెక్రటరీ సచివాలయం కి వచ్చాను అని చెబుతూ.. మూడు రోజులు అటెండెన్స్ వేయకపోవడంతో.. అక్కడున్న ప్రజలు అవాక్కయ్యారు. సచివాలయం మర్చిపోయాను అంటూ మున్సిపల్ అధికారులకు తెలిపారు. ప్రజల కోసమే సచివాలయం ఉందని, మీ సొంత పనులు ఉంటే లీవ్ పెట్టుకోవాలని మున్సిపల్ అధికారి సచివాలయం ఉద్యోగికి తెలిపారు.