టెక్కలి జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కోళ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. పలాస నుండి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ టెక్కలి సర్వీస్ రోడ్డు సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడడంతో అధిక సంఖ్యలో కోళ్లు మృతిచెందాయి. ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. హైవే పై జరుగుతున్న పనులను గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. టెక్కలి పోలీసులు పరిశీలించారు.