గురువారం గోపాల్పేట మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులను నిర్వహించాలని డెంగ్యూ కేసులు వ్యప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.