స్వర్ణాంధ్ర 20047 అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 20 సూత్రాల కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంక దినకర్ జిల్లాలో అమలవుతున్న జలజీవన్ మిషన్ అమృత 1.0 విద్యా వైద్య ఉపాధి హామీ శాఖలకు సంబంధించి పథకాలు అమలుపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ మున్సిపల్ కమిషనర్ మోర్య డిఆర్ఓ నరసింహులు తో సమీక్ష నిర్వహించారు.