ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సెప్టెంబర్ 10న నిర్వహిస్తున్న భవన నిర్మాణ, నిర్మాణ రంగా కార్మికుల యూనియన్ జిల్లా 3వ మహాసభలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ కోరారు. ఆదివారం బోథ్ మండల కేంద్రంలోని గంగపుత్ర భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లు తీసుకువచ్చి బిల్డింగ్, ఇతర కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనుభవిస్తున్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేసేకుట్ర చేస్తుందని అన్నారు.