అనంతపురం నగర శివారులోని అనంతపురం రూరల్ మండల పరిధిలో ఉన్న కక్కలపల్లి టమోటా మార్కెట్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రూరల్ మండల పరిధిలోని కాట్నే కాలువ గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.