కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ జిల్లా పేరు మార్చాలని బీసీ సంఘాలు, అదేవిధంగా నాయకర్ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు నేడు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడకి చెందిన మల్లాడి సత్య లింగ నాయకర్ వందల కోట్ల ఆస్తి పేదల విద్య,వైద్యం కోసం ఇవ్వడమే గాక కాకినాడలోని విద్యా సంస్థలకు స్థలాలు రాసిచ్చారని మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా నామకరణ సమితి తెలిపింది. కాకినాడజిల్లాకు నాయకర్ పేరు పెట్టాలంటూ 2వ తేదీజిల్లా నలుమూలలనుంచి ప్రజలు కలెక్టరేట్ చేరుకొని ధర్నా చేపట్టాలన్నారు.