ఆళ్లగడ్డ మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ నరసింహ స్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు పూజలు చేశారు. స్వామివారికి అమ్మవార్లకు అహోబిలం పీఠాధిపతి యత్రేంద్ర నారాయణ మహాదేశికన్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూజలు గావించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.