తొమ్మిది రోజులపాటు వైభవంగా, శోభాయమానంగా, వేదమంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు అందుకున్న గణనాథుడు మొదటిరోజు శుక్రవారం నిమజ్జనోత్సవం వైపు ముందుకు సాగుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రాల్లో సుమారు 500కు పైగా వినాయక మండపాలు నెలకొల్పి ఆయా మండపాల్లో గణనాథులను ప్రతిష్టించి, సామూహికంగా మహిళలచే కుంకుమ పూజలు, గణపతి హోమం, అన్నప్రసాదాలు తదితర విశేష పూజా కార్యక్రమాలు తొమ్మిది రోజులపాటు వాడవాడలా పిల్లా,పాపలు, మహిళలు పెద్దలు మాతలు మండపాలకు చేరుకొని, వేడుకగా భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుంటూ, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, తొమ్మిది రోజులపాటుగా వైభవోపేతంగా సాగిన గణనాథుని పూజల అనంతరం