అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతపురం నగరానికి చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. చిన్నపాటి ఘర్షణకు నేపథ్యంలో వారు ఆసుపత్రిలోనే బాహాబాహీకి దిగారు. దీంతో అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.