అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ కు కనీస వేతనం 26వేల రూపాయలు చెల్లించాలని కర్నూల్ లో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 12 గంటలకు కర్నూలు నగరంలోని కర్నూలు అర్బన్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ శాఖకు ప్రధానంగా పనిచేస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. క్షణమే కనీస వేతనం అమలు చేయాలని వారు కోరారు.