కుడా నిధులు రూ.29.84 లక్షలతో కర్నూలు నగరంలో 100 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూలు నగరంలో 100 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి కుడా నిధులు రూ.29.84 లక్షల చెక్ ను మంత్రి చేతుల మీదుగా కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉంటారని తెలిపారు. వారి ఆశయాల మేరకు జిల్లాలో కర్నూలు నగరంలో ఏ ఐ టెక్న