హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించడంతో టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు ఆదివారం సంబరాలు చేసుకున్నారు. శాంతిపురం మండలం గుండి శెట్టిపల్లి వద్ద హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు కుప్పం వైపు పరవళ్లు తొక్కుతుండటంతో నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా ప్రజలు కాలువ వద్దకు చేరుకుని కృష్ణా జలాలకు జలహారతి పట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.