రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీ లను త్వరగా పూర్తి చేస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మీడియాతో అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి స్వామి ఇటీవల క్యాబినెట్ మీటింగ్ లో జరిగిన చర్చ గురించి మీడియాకు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు వివరించారు. గత వైసిపి ప్రభుత్వం కేవలం 18 శాతం మెడికల్ కాలేజీ పనులు చేసి ఏదో చేసినట్లుగా చెప్పుకుంటుందని మంత్రి ఎద్దేవా చేశారు. 2027వ నాటికి మెడికల్ కాలేజీలో వైద్య విద్యను విద్యార్థులకు అందిస్తామన్నారు.