సముద్ర తీరపు నీటి అడుగు భాగాన సముద్రపు నాచు పెంచేలా పీతల హేచరీ స్థాపన, పీతల పెంపకానికి సంబంధించి ఎక్స్పోజర్ సందర్శనలు నిర్వహించి యూనిట్ల స్థాపనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మత్స్య శాఖ డిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించి, సముద్రపు నాచు యూనిట్లు స్థాపన పీతల హేచరీ పీతల పెంపకం అంశాలపై సమీక్షించారు.