వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అన్నదాత పోరు అంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాటు రైతుల కోసం ఏ మాత్రం ఆలోచించకుండా పాలన చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరు అంటూ మొసలి కన్నీరు కార్చడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. రైతుల దెబ్బకే వైసిపి గత ఎన్నికల్లో 11సీట్లకు పరిమితం అయ్యిందని అన్నారు.