రాజోలు లో అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండేళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు పోలిశెట్టి పాండు రంగారావు,లంక మురళీకృష్ణ లను రాజోలు మండలం, శివకోటి గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి రూ.17,30,000/విలువ చేసే 171 గ్రాముల బంగారు ఆభరణాలు,200 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.